TV9 సీఈవో రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు

TV9 సీఈవో రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు

TV9 మీడియా సంస్థలో యాజమాన్యానికి, సీఈవో రవిప్రకాశ్ కు తలెత్తిన వివాదం కేసులకు దారితీసింది. రవిప్రకాశ్ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ టీవీ9 యాజమాన్య సంస్థ అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రవిప్రకాశ్ పై పోలీసులు ఐపీసీ 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీవీ9 ఆఫీసులో, రవిప్రకాశ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. రవిప్రకాశ్ కోసం కూడా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. టీవీ9ను స్థాపించిన ఏబీసీ లిమిటెడ్ నుంచి ఈమధ్యే అలంద మీడియా సంస్థ కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలోనే కొత్త మేనేజ్ మెంట్ కు, సీఈవోకు మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.