గుకేశ్‌‌‌‌‌‌‌‌, ప్రజ్ఞాకు సవాల్‌‌‌‌‌‌‌‌..ఆగస్టు 18 నుంచి సింక్ ఫీల్డ్ కప్

గుకేశ్‌‌‌‌‌‌‌‌, ప్రజ్ఞాకు సవాల్‌‌‌‌‌‌‌‌..ఆగస్టు 18 నుంచి సింక్ ఫీల్డ్ కప్

సెయింట్ లూయిస్ (అమెరికా): వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌, ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ కొంత గ్యాప్ తర్వాత క్లాసికల్ చెస్‌‌‌‌‌‌‌‌లో పోటీకి రెడీ అయ్యాడు.   సోమవారం మొదలయ్యే ప్రతిష్టాత్మక సింక్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో గుకేశ్‌‌‌‌‌‌‌‌తో పాటు మరో యంగ్‌‌‌‌‌‌‌‌ స్టర్ ఆర్. ప్రజ్ఞానంద బరిలో నిలిచాడు. ఈ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్ వన్  మాగ్నస్ కార్ల్‌‌‌‌‌‌‌‌సన్ లేకపోయినా పలువురు స్టార్లు బరిలో నిలవడంతో ఇండియా ప్లేయర్లకు  కఠిన సవాల్ ఎదురు కానుంది. ఇది గ్రాండ్ చెస్ టూర్‌‌‌‌‌‌‌‌లోని ఐదో అంచె.  ఈ టోర్నీ పెర్ఫామెన్స్ ఆధారంగా ప్లేయర్లు గ్రాండ్ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధిస్తారు. ప్రస్తుతం గ్రాండ్ చెస్ టూర్ పాయింట్ల పట్టికలో ప్రజ్ఞానంద ఐదో స్థానంలో ఉండగా, గుకేశ్ అతడి కంటే వెనుకంజలో ఉన్నాడు. 

ఈ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే ఆటగాళ్లలో అమెరికాకు చెందిన ఫాబియానో కారువానా, ఫ్రాన్స్ కు చెందిన అలీరెజా ఫిరౌజా, ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న లెవోన్ అరోనియన్ ఇండియా గ్రాండ్ మాస్టర్లకు గట్టి పోటీ ఇవ్వగలరు. ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాగ్జిమ్ -లాగ్రేవ్ ను ఓడించడం కూడా  కష్టమే. అరోనియాన్ ఇటీవల అద్భుతమైన ఫామ్‌‌‌‌‌‌‌‌ను కనబరిచాడు. లాస్ వెగాస్ లో జరిగిన ఫ్రీస్టైల్ చెస్, సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్లలో విజయం సాధించి జోరు మీదున్నాడు. సెయింట్‌‌‌‌‌‌‌‌ లూయిస్ ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ఆరో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో నిరాశ పరిచినప్పటికీ గుకేశ్ కు క్లాసికల్ చెస్‌‌‌‌‌‌‌‌లో అద్భుతమైన రికార్డు ఉంది. దాంతో ఈ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో అభిమానులు అతడి నుంచి అద్భుతాలు ఆశిస్తున్నారు.  మరోవైపు, ప్రజ్ఞానంద ఇప్పటికే వచ్చే ఏడాది జరగనున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించాడు. వచ్చే నెలలో జరిగే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో కూడా గుకేశ్, ప్రజ్ఞానంద పాల్గొననున్నారు.  ఈ నేపథ్యంలో  సింక్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ కప్ లో  సత్తా చాటాలని ఆశిస్తున్నారు. పది మంది వరల్డ్ క్లాస్  ప్లేయర్లతో తొమ్మిది రౌండ్లు జరిగే ఈ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌కు రూ. 3 కోట్ల పైచిలుకు ప్రైజ్‌‌‌‌‌‌‌‌మనీ ఉంది.