
హైదరాబాద్, వెలుగు: నేషనల్ సబ్-జూనియర్ గర్ల్స్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ శుభారంభం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో ఆదివారం జరిగిన గ్రూప్–సి తొలి పోరులో తెలంగాణ అమ్మాయిల జట్టు 3–-0 తేడాతో త్రిపురను చిత్తుగా ఓడించింది.
తీర్థ డబుల్ గోల్స్‌తో సత్తా చాటింది. తను 27వ, 66వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసి జట్టును 2–0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. చివర్లో అరుణ జ్యోతి 74వ నిమిషంలో చేసిన గోల్‌తో తెలంగాణ విజయం ఖాయమైంది. డిఫెండర్లు కూడా అద్భుతంగా ఆడటంతో ప్రత్యర్థి త్రిపుర ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఫలితంగా తెలంగాణ మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ 4–0 తేడాతో చండీగఢ్‌ను ఓడించింది. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో తెలంగాణ.. చండీగఢ్‌తో పోటీ పడనుంది.