2020ని మర్చిపోవాలె.. వీళ్లను మాత్రం యాదికుంచుకోవాలె..

2020ని మర్చిపోవాలె.. వీళ్లను మాత్రం యాదికుంచుకోవాలె..
మ్యాజిక్‌‌ ఫిగర్‌‌ 2020..  అదృష్టాన్ని  తెచ్చిపెడుతుందేమోనని ఆశతో అడుగుపెట్టారంతా. కానీ,  ఆరంభంలోనే అపశ్రుతులు.. విషాదాలు. తేరుకునేలోపే కరోనా వైరస్‌‌ రూపంలో ప్రమాదం ప్రపంచాన్ని ముంచెత్తింది. మూడు నెలలు తిరగక ముందే ‘వీ హేట్‌‌ 2020’ నినాదం సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్స్‌‌ను ఊపేసింది. కరోనా–లాక్‌‌డౌన్‌‌..  వరుస ఘటనలు జనాలకు ఊపిరి సలపనివ్వలేదు.  ఎంతో మందిని  సంతోషాలకు, సరదాలకు దూరం చేసిన ఈ ఇయర్ విరక్తి కలిగించింది.  అదేటైంలో ప్రతీఒక్కరి ‘లైఫ్‌‌’కి  కొత్త అనుభవాల్ని అందించి..  ఎన్నో పాఠాలు నేర్పించింది ఇయర్​ 2020. ఈ 2020ని,  ఈ ఏడాది మిగిల్చిన అనుభవాల్ని మర్చిపోవాలి.. ఈ ఏడాది విన్నర్‌‌ ఈ సంవత్సరంలో జనాలు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చింది.. ‘ఇంటర్నెట్‌‌’కు. లాక్‌‌డౌన్‌‌ కంటే ముందు ‘వైరస్‌‌’ పేరు మీదున్న సినిమాల్ని ఎగబడి చూసిన జనాలు..  తర్వాతి రోజుల్లో సీరియస్‌‌ టర్న్‌‌ తీసుకున్నారు.  ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌తో పాటే ఆరోగ్యాన్ని పట్టించుకోవడం జనాలు నెమ్మదిగా అలవాటు చేసుకున్నారు. ‘కధా టీ’ మొదలు..  ఇమ్యూనిటీని పెంచే రకరకాల వంటకాల గురించి సెర్చ్‌‌ చేశారు. ఇంటర్నెట్‌‌ ద్వారానే ఇమ్యూనిటీ బూస్టర్స్‌‌, ఫిట్‌‌నెస్ మీద జనాలకు అవేర్‌‌నెస్‌‌ వచ్చింది. ట్రెండ్‌‌ అయినయ్‌‌ లాక్‌‌డౌన్‌‌ టైంలో మూడు నెలలు ఇంటికే పరిమితం అయ్యారంతా.  సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా పొద్దుపోవడానికి రకరకాల ఛాలెంజ్‌‌లతో మస్త్‌‌ టైంపాస్‌‌ చేశారు. గ్రీన్‌‌ ఛాలెంజ్‌‌, కుకింగ్‌‌, ఫిట్‌‌నెస్‌‌, పిల్లో, ఓల్డ్‌‌–న్యూ ఫొటోల ఛాలెంజ్‌‌లు బాగా ట్రెండ్ అయ్యాయి.  కొరియాలో లాక్‌‌డౌన్‌‌ టైంలో బోర్‌‌డమ్‌‌ను పోగొట్టుకునేందుకు మొదలైన ‘డల్గోనా కాఫీ’..  ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది.  పబ్‌‌జీ లాంటి గేమ్‌‌ పీక్స్‌‌లో ఉన్న టైంలో..  అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ‘లూడో గేమ్‌‌’ మన దగ్గర జోరు చూపించింది.  డెత్‌‌ సెలబ్రేషన్స్‌‌ మీమ్‌‌, కరోనా పేరు మీద ఉన్న ఊర్లు, షాపుల పేర్లు సరదాగా సోషల్‌‌ మీడియాలో వైరల్ అయ్యాయి. పాత సీరియళ్లు, సినిమాలు మళ్లీ ట్రెండ్‌‌లోకి వచ్చి.. జనాలకు ‘నోస్టాల్జియా’ అనుభూతుల్ని అందించాయి. రియల్ హీరోల కథలు లాక్‌‌డౌన్‌‌ టైంలో ప్రత్యక్షంగా జనాలకు సాయం చేస్తున్న వాళ్లు కొందరు. అలాగే కొవిడ్‌‌ పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్‌‌ అందిస్తూ ‘ కరోనా వారియర్స్‌‌’గా గౌరవాన్ని అందుకుంటున్నారు  మెడికల్ స్టాఫ్‌‌. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ కొవిడ్‌‌ పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ అందించిన మన కాలపు నైటింగేల్స్‌‌ కథలు ఎన్నో ఉన్నాయి. కేరళలో కరోనాని సమర్థవంతంగా కట్టడి చేసిన ప్రయత్నానికి హెల్త్‌‌ మినిస్టర్‌‌ శైలజకు.. ఇంటర్నేషనల్ లెవల్‌‌లో గుర్తింపు దక్కింది. కళతో కళ్లముందు.. కరోనా టైంలో తమ కళ ద్వారా జనాల్లో అవగాహన నింపే ప్రయత్నం చేశారు కొందరు కళాకారులు. ‘చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా.. కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకు రా..’ అంటూ చౌరస్తా అందించిన పాట జాగ్రత్తలను గట్టిగానే చెప్పింది.  వలస బతుకులకు అద్దం పట్టే పాట ‘పిల్లజెల్లా ఇంటికాడ ఎట్ల ఉండ్రో’తో పాపులర్ అయ్యాడు ఆదేశ్ రవి.  ములుగు శంకర్‌‌ లాంటి కళాకారులతో పాటు సినిమావాళ్లు కూడా మాయదారి రోగంపై ఫుడ్ మ్యాన్… మల్లేశ్వర రావు మల్లేశ్వర్ రావు అనే ఈ అబ్బాయి పెద్ద ఫంక్షన్ లలో, రెస్టారెంట్‌లలో మిగిలిపోయిన ఫుడ్ చెత్త కుప్పల్లోకి చేరకుండా ఆకలితో ఉన్నవాళ్లకి చేర్చాడు. కోవిడ్ టైంలో కనీసం రోజుకి 50వేలమందికిపైగా ఫుడ్, రేషన్ అందించాడు. కోవిడ్​తో చనిపోయిన వాళ్ల క్రిమేషన్ కి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఫ్రెండ్ కారుని మార్చురీ వ్యాన్ లాగా మార్చేసిండు. వందకు పైగా మృతదేహాలని క్రిమేట్ చేశాడు.  ఆటో కార్మికులకు ఫుడ్ అందిస్తూ. వందల మంది పేదల ఆకలిని తీరుస్తున్నాడు. సోనూభాయ్‌‌లు ఎందరో.. ఒక సెలబ్రిటీగా లాక్‌‌డౌన్ టైంలో ఎంతోమందికి సాయపడ్డాడు సోనూ సూద్‌‌.  అలాగే తమకి ఉన్నంతలో నలుగురికి సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నారు కొందరు. ‘మనిషికి మనిషే అండ’ అని నమ్మే  కోలార్‌‌(కర్ణాటక) బ్రదర్స్‌‌ తాజమ్మల్‌‌, ముజమిల్‌‌ పాషాలు.. ఆస్తులమ్మి మరీ వలస కూలీలకు అన్నం పెట్టిన తీరు దేశం మొత్తాన్ని ఆకర్షించడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది కూడా.  ములుగు జిల్లా అడవుల్లోని మారుమూల పల్లె ‘నీలంతోగు’కి సరుకులు పంచడానికి వెళ్లాడు ఓయూ స్టూడెంట్‌‌ ఇస్రం సంతోష్‌‌ .  అక్కడి పిల్లల స్థితి చూసి జాలిపడి దోస్తుల సాయంతో ‘భీమ్‌‌ హ్యాపీనెస్‌‌ సెంటర్‌‌’ పేరుతో ఒక స్కూల్ తెరిచి పాఠాలు చెప్తున్నాడు. లాక్‌‌డౌన్‌‌ టైంలో హైదరాబాద్‌‌లో కూలీలకు అన్నం అందించిన ‘రైస్ ఏటీఎం’ రాము, పోషకాలున్న ఫుడ్​ పిల్లలకు తినడానికి ఇస్తూ అందరితో ‘శెభాష్‌‌’ అనిపించుకున్నాడు. కొవిడ్‌‌ టైంలో తన కారునే అబులెన్స్‌‌గా మార్చేసుకుని సర్వీస్ చేసిన గణేశ్‌‌ భట్(ఉత్తరాఖండ్‌‌), ‘రెంట్‌‌ ఫర్‌‌ హెల్త్‌‌ వర్కర్స్‌‌’ ద్వారా మెడికల్ స్టాఫ్‌‌కి బాసటగా నిలిచిన సచన్య(కోల్‌‌కతా)..   ఇలా ఎందరో లాక్‌‌ డౌన్‌‌ టైంలో మంచి మనసుతో ‘రియల్ హీరోలు’ అనిపించుకున్నారు. ఆకలి తీర్చే ‘రైస్​ ఏటీఎం’ లాక్​ డౌన్​ ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. పనిలేక, తలదాచుకోనీకి ఇల్లు లేక వలస కూలీలు రోడ్డెక్కినరు. ఆ ఆకలి బాధను చూడలేక మీకు నేనున్నాను. మీ ఆకలి తీరుస్తాను. మండే ఎండల్లో నడిచి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని దోసపాటి రాము భరోసానిచ్చిండు. వెనక్కిపోతున్న కూలీలే కాదు సిటీలో కూలీనాలి చేసుకుని బతికే బస్తీ జనాలను ఆదుకున్నడు. బడి లేక పస్తులుంటున్న టీచర్లు, పనిలేక బాధపడుతున్న పేదోళ్లందరికీ బియ్యం, కిరాణా సరుకులు ఇయ్యడం మొదలుపెట్టిండు. అర్థరాత్రి వచ్చినా సరే ఆకలి తీర్చే ఏర్పాటు చేసిన ఆ ఇంటి ముందు ‘రైస్​ ఏటీఎం’ని స్టార్ట్​ చేసిండు. ఇండ్లల్లో పని చేసేటోళ్లు, అడ్డామీది కూలీలు, బీహార్​, చత్తీస్​గఢ్​ నుంచి వచ్చిన వేల మంది వలస కూలీలకు వందల రోజుల నుంచి ఆకలి తీరుస్తున్నది ఈ రైస్​ ఏటీఎం. ఓ ఈవెంట్​ మేనేజ్​మెంట్​ కంపెనీలో మేనేజర్​గా పనిచేసే రాము చేస్తున్న ఈ మంచి ప్రయత్నానికి కొంతమంది మనసున్న వాళ్లు తమవంతు సాయం చేస్తున్నారు. ఏప్రిల్​ 16న ప్రారంభమైన ఈ రైస్​ ఏటీఎం ఇప్పటికీ నడుస్తోంది. 262 రోజుల్లో అవసరముందని వచ్చినవాళ్లకు ఆసరాగా ఉన్నడు.బియ్యం, కిరాణా సరుకులు ఇయ్యకుండా పొమ్మని ఏ ఒక్క రోజూ అనలేదు. అంతేకాదు వలసకూలీల్లో పాలిచ్చే తల్లులూ ఉంటారు. పసిపిల్లల ఆకలి తీర్చడానికి పాలప్యాకెట్లు, పాలపొడిని కూడా ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు చేశారిక్కడ. For More News.. కలెక్టర్ పేరుతో తెలంగాణలో ఊరు! ఎందుకు పెట్టారో తెలుసా? ఈ ఏడాది ఎక్కువగా ఇవే వెతికిన్రు ఈ ఏడాది బ్యాలెన్స్ తప్పింది!