మూడు కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన 2027 మార్చి 25న జరిగిన కేంద్ర కేబినెట్ లో.. మాడిఫైడ్ ఉడాన్, IVFRT, పర్యావరణ లక్ష్యాలకు సంబంధించిన పథకాలకు ఆమోదం లభించింది. పథకాల పొడిగింపుకు కేబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు. మూడు పథకాలను కొనసాగిస్తూ 30 వేల 640 కోట్ల ప్యాకేజీని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విమానయాన అభివృద్ధికి సంబంధించి సవరించిన ఉడాన్ పథకానికి ఆమోదంతెలిపారు. 28 వేల 480 కోట్ల రూపాయలతో పదేళ్లపాటు ఉడాన్ స్కీంను కొనసాగించాలని నిర్ణయించారు. ఉడాన్ స్కీం కింద 100 ఎయిర్ పోర్టుల అభివృద్ధి చేయనున్నారు. దీంతో టైర్ 2, టైర్ 3 సిటీస్ లో విమాన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
►ALSO READ | సంక్షోభ సమయంలో ఇండియాకు అండగా రష్యా.. ఏప్రిల్లో 60 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ !
అదే విధంగా విదేశీయుల ట్రాకింగ్ ( IVFRT) పథకం మరో 5 ఏళ్లు పొడిగించాలని నిర్ణయించారు. రూ.1800 కోట్లతో IVFRT స్కీం కొనసాగించనున్నారు. ఏప్రిల్ 1, 2026 నుంచి 2031 వరకు అమల్లో ఉండనుంది. NDC కింద 2025–35 కాలానికి భారత్ పర్యావరణ లక్ష్యాలకు కేబినెట్ ఓకే చెప్పింది.
