చంచల్ గూడ జైలుకు మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి

చంచల్ గూడ జైలుకు మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి నాలుగో రోజు కస్టడీ పూర్తయ్యింది. నాలుగు రోజుల పాటు నర్సింహారెడ్డి ని విచారించిన ఏసీబీ.. కస్టడీ అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం నుండి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచింది. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌పై అధికారులు ‌చంచల్ గూడ జైలుకు తరలించారు.

నాలుగు రోజుల కస్టడీలో నర్సింహారెడ్డి అక్రమాలు, బిజినెస్‌లు, బినామీలపై ఏసీబీ ఆరా తీసింది. హైటెక్ సిటీ లో సర్వే నెంబర్ 64 లో ఉన్న 2 వేల గజాల భూమి తన పదవి అడ్డు పెట్టుకుని దక్కించుకున్నటు తేల్చింది. 2 వేల గజాల భూమి ప్రభుత్వ భూమి గా తేల్చిన ఏసీబీ.. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేష‌న్ చేసిన రెవెన్యూ అధికారులను విచారించింది. తన పదవిని అడ్డుపెట్టుకుని నర్సింహారెడ్డి పెద్ద ఎత్తున అక్రమాస్తుల కూడ బెట్టినట్టు ఈ విచార‌ణ‌లో వెల్ల‌డైంది. నర్సింహారెడ్డి రియల్ ఎస్టేట్ తో పాటు పలు హోటల్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించింది. ఆరోప‌ణ‌లు రుజువు కావ‌డంతో నర్సింహారెడ్డి ని ఏసీబీ అధికారులు గురువారం చంచల్ గూడ జైలు కు తరలించారు.