
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన నటించిన సినిమాలు తెలుగులో రిలీజై మంచి విజయాన్ని అందుకున్నాయి. అందులో భాగంగా వచ్చినవే.. "మిన్నల్ మురళి", "2018", "అన్వేషిప్పిన్ కాండెతుమ్ ", L2:"ఎంపురాన్", "ARM","నరివెట్ట" సినిమాలు.
నడిగర్ ఓటీటీ:
టొవినో థామస్ నటించిన మలయాళ కామెడీ డ్రామా ‘నడిగర్’. ఇందులో టోవినో థామస్, సౌబిన్ షాహిర్, భావన, సురేష్ కృష్ణ, బాలు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 8న ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ మూవీ థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత స్ట్రీమింగ్కి వచ్చింది. ప్రస్తుతం మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సైనాప్లే ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఓ స్టార్ హీరో జీవితంలోని ఎదురైనా కష్టాలను మూవీలో ఫన్నీగా చూపించారు. కానీ, అది ఏ మాత్రం ఆడియన్స్ను అట్రాక్ట్ చేయలేకపోయింది. లాల్ జూనియర్ మూవీ డైరెక్ట్ చేశారు. గాడ్ స్పీడ్ సినిమాతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, అలాన్ ఆంటోనీ, అనూప్ వేణుగోపాల్ ఈ మూవీని నిర్మించారు.
ఈ క్రమంలో మూవీ థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ, కేవలం రూ.5.39 కోట్లు మాత్రమే రాబట్టి, నిర్మాతకు నష్టాలు మిగిల్చింది. మరి ఈ సినిమా పూర్తి కథేంటనేది ఓ లుక్కేయండి.
#Tovino’s #Nadikar (Malayalam) Now streaming on @SainaPlay in Malayalam, Tamil, Telugu & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/93vtWGhC7d
— OTT Trackers (@OTT_Trackers) August 9, 2025
కథేంటంటే:
నడిగర్ అంటే నటుడు అని అర్థం. ఈ సినిమా అంతా ఒక యాక్టర్ చుట్టే తిరుగుతుంది. సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్(టోవినో థామస్)తో అనుభవజ్ఞుడైన డైరెక్టర్ (రంజిత్) సినిమా తీస్తాడు. ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు డేవిడ్ యాక్టింగ్ నచ్చకపోవడంతో అతనిపై అరుస్తాడు. వాస్తవానికి డేవిడ్ ఒకప్పుడుగా బాగా నటించేవాడు.
►ALSO READ | సినీ నిర్మాతలకు కార్మిక సంఘాలు డెడ్ లైన్.. రేపటి నుంచి అన్ని షూటింగ్‌లు బంద్
కానీ.. వరుసగా నాలుగైదు సినిమాలు హిట్ కావడంతో అహంకారం బాగా పెరిగిపోతుంది. అన్ని విషయాలను చాలా తేలికగా తీసుకుంటాడు. కథలను ఎంచుకునే విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తాడు. యాక్టింగ్ సరిగ్గా చేయడు. దాంతో వరుస పరాజయాలు చూడాల్సి వస్తుంది.
సాధారణ ప్రజలతోపాటు మీడియావాళ్లు, డైరెక్టర్లు కూడా అతని యాక్టింగ్‌ని విమర్శిస్తారు. సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే తన కెరీర్‌ని మళ్లీ నిలబెట్టుకోవాలి అనుకుంటాడు. ఆ ఆలోచనతోనే ప్రొఫెషనల్ యాక్టింగ్ కోచ్ బాలా(సౌబిన్ షాహిర్)ను నియమించుకుంటాడు. కానీ.. డేవిడ్‌కు ఉన్న కోపం వల్ల బాలాతోనూ సమస్యలు వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అతని యాక్టింగ్ స్కిల్స్‌ని మెరుగుపరుచుకున్నాడా? లేదా? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.