బీజేపీలో చేరిన మాజీ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా

బీజేపీలో చేరిన మాజీ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా

 లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ దేశ వ్యాప్తంగా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరికల జోరు కనిపిస్తుంది. మాజీ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా బీజేపీ పార్టీలో చేరారు. దేశ రాజధాని  ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో కమలం పార్టీలో చేరారు. 

ఘజియాబాద్‌ నుంచి బీజేపీ ఆయనను లోక్‌సభ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందని సమాచారం. ఆర్కేఎస్ భదౌరియా 23వ వైమానిక దళ చీఫ్‌గా సెప్టెంబర్ 30, 2019 నుండి సెప్టెంబరు 30, 2021 వరకు ఉన్నారు.భదౌరియా ఆగ్రా జిల్లాలోని బహ్ తహసీల్ నివాసి. సాయుధ దళాల్లో పదవి విరమణ చేసిన రెండున్నరేళ్ల తర్వాత ఇవాళ  బీజేపీ పార్టీలో చేరారు.