
చేవెళ్ల, వెలుగు: యువత సమాజం గర్వించే స్థాయిలో బతకాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం చేవెళ్లలో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో కాలేజీ స్టూడెంట్స్కు సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశం, ధర్మం, తల్లిదండ్రుల కోసం పరితపించాలన్నారు. ప్రముఖ సైకలజిస్ట్ మల్లేశ్, మోటివేటర్ గంప నాగేశ్వరరావు, నార్కోటిక్స్ విభాగం ఎస్పీ కృష్ణమూర్తి, రేగళ్ల అనిల్ కుమార్ పాల్గొన్నారు.