జీతాలు లేటైతే ఉద్యోగులు సర్దుకుపోవాలె : స్వామిగౌడ్

జీతాలు లేటైతే ఉద్యోగులు సర్దుకుపోవాలె : స్వామిగౌడ్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు జీతాలు ఆలస్యమవుతాయని..ఉద్యోగులు సర్ధుకోవాలని మండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత స్వామి గౌడ్ అన్నారు.  గతంలోనూ పలు సందర్భాల్లో ఉద్యోగులకు జీతాలు ఆలస్యమయ్యాయని చెప్పారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఉద్యోగులు తమ ఒక్క రోజు వేతనాన్ని ప్రభుత్వానికి ఇచ్చి అండగా నిలిచామని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎవరికి అమ్ముడు పోలేదన్నారు. ఉద్యోగుల వేతనాల కోసం తెలంగాణ ఎన్జీవో సంఘం పోరాడుతానే ఉంటాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యోగులు అన్ని పార్టీలతో కలిసి ఉద్యమాలు చేశాయని స్వామి గౌడ్ అన్నారు. గతంలో కిషన్ రెడ్డి పోరు యాత్రకు టీఎన్జీవోలు మద్ధతు ఇచ్చారని..యాత్రలో పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ కావాలనే ఆకాంక్షతోనే ఉద్యోగులు ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పారు.  ఉద్యోగులపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు..తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడున్నారని స్వామి గౌడ్ ప్రశ్నించారు. బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలతో ఆ పార్టీకి ఉద్యోగులు దూరమవుతారని హెచ్చరించారు.


టీఆర్‌ఎస్‌కు ఓటెయ్యాలని పిలుపునిస్తే తప్పేంటి
తెలంగాణ కోసం చివరి వరకు టీఎన్జీవోలు చివరి వరకు నిలబడ్డారని టీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్ అన్నారు. టీఎన్జీవో నేతలు ఎక్కువ మంది టీఆర్ఎస్ లో ఉన్నారన్న అక్కసుతోనే బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరిస్తున్న టీఆర్ఎస్ కు ఓటేయ్యాలని పిలుపునిస్తే తప్పేంటని దేవీప్రసాద్ ప్రశ్నించారు.