టీఆర్ఎస్లోకి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే

టీఆర్ఎస్లోకి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో తన సతీమణితో కలిసి కారు పార్టీ కండువా కప్పుకున్నారు. మంగళవారం రాత్రి  సీఎం కేసీఆర్తో ఓదేలు దంపతులు భేటీ అయ్యారు. కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన టీఆర్ఎస్లో చేరినట్లు సమాచారం.

ఇటీవలె నల్లాల ఓదేలు దంపతులు కాంగ్రెస్లో చేరారు. టీఆర్ఎస్లో తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదంటూ వారు హస్తం కండువా కప్పుకున్నారు. అయితే కొన్ని రోజుల్లోనే తిరిగి టీఆర్ఎస్లో చేరడం గమనార్హం. 2009, 2010, 2014 ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి గెలిపొందారు. 2018లో టీఆర్ఎస్ అధిష్టానం ఓదేలుకు కాకుండా బాల్కసుమన్ కు టికెట్ ఇవ్వడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు.