తప్పుగా జీడీపీ నెంబర్లు : అర్వింద్ సుబ్రమణియన్

తప్పుగా జీడీపీ నెంబర్లు :  అర్వింద్ సుబ్రమణియన్

న్యూఢిల్లీ :  తాజా జీడీపీ నెంబర్లు వింతగా ఉన్నాయని, వివరించడం కష్టంగా ఉందని మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) అర్వింద్ సుబ్రమణియన్ కామెంట్‌‌‌‌ చేశారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో క్వార్టర్ (అక్టోబర్ – డిసెంబర్‌‌‌‌‌‌‌‌) లో  దేశ జీడీపీ 8.4 శాతం వృద్ధి చెందింది. ‘తాజా జీడీపీ నెంబర్లపై నిజాయితిగా మాట్లాడుతున్నా, నాకేం అర్థం కాలేదు’ అని  అన్నారు.  

ఈ నెంబర్లు చూస్తుంటే ఇన్‌‌‌‌ఫ్లేషన్  ఒక శాతం నుంచి 1.5 శాతం మధ్య ఉన్నట్టు అనిపిస్తోందని, కానీ వాస్తవానికి 3 శాతం నుంచి 5 శాతం మధ్య ఉందని వివరించారు. ప్రైవేట్ కన్జంప్షన్‌‌‌‌ 3 శాతం దగ్గర ఉన్నా ఎకానమీ 7 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను వేసిన జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.6 శాతంలో 4.3 శాతం కరెక్ట్ అని అన్నారు.