చారిత్రక పరి శోధక నవలలు రావాలి :  మాజీ సీఎం  కేసీఆర్ 

చారిత్రక పరి శోధక నవలలు రావాలి :  మాజీ సీఎం  కేసీఆర్ 
  •      మాజీ సీఎం  కేసీఆర్ 

ములుగు, వెలుగు: తెలంగాణ తరగని చారిత్రక గని అని, అనేక చారిత్రక పరిశోధక నవలలు ఈ ప్రాంతం నుంచి రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు రాసిన కొండమల్లు నవలను నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తితో కలిసి గురువారం ఎర్రవల్లిలోని నివాస గృహంలో  కేసీఆర్ కు  అందించారు.

నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి మొదలై ఆంధ్ర, రాయలసీమ వరకు విస్తరించిన నల్లమల చెంచుల జీవనం సంస్కృతి, ప్రస్తుతం వారి అవసరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వీలు చూసుకొని నవల చదువుతానని చెప్పారు. రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లును అభినందించారు. భవిష్యత్​లో తెలంగాణ చారిత్రక అంశాల మీద దృష్టి పెట్టి నవల రాయాలని సూచించారు.