ప్రభుత్వం మారినా.. కేసీఆర్ ఫొటోతోనే ఈహెచ్ ఎస్ సేవలు

ప్రభుత్వం మారినా.. కేసీఆర్ ఫొటోతోనే  ఈహెచ్ ఎస్ సేవలు

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని శ్రీకర హాస్పిటల్‌‌లో మాజీ సీఎం కేసీఆర్ ఫొటోతోనే ఈహెచ్‌‌ఎస్ సేవలు కొనసాగుతున్నాయి. రెండున్నర సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ సంబంధిత డీఎంఎస్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

రోజూ పెద్ద సంఖ్యలో రోగులు, వారి సహాయకులు ఆస్పత్రికి వస్తున్నా, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫొటోలు మారుస్తారా? లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అనే చర్చ సాగుతోంది.