నా తండ్రి ఫొటోతో ఓట్లడుగుతున్నారు: బీజేపీపై ఉద్ధవ్ థాక్రే ఫైర్

నా తండ్రి ఫొటోతో ఓట్లడుగుతున్నారు: బీజేపీపై ఉద్ధవ్ థాక్రే ఫైర్

ముంబై: ప్రజలను కుల, మతాలుగా విభజించే పార్టీని రాష్ట్రంలో గెలవనిచ్చేదిలేదని శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే అన్నారు. శనివారం జల్నాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రచార పోస్టర్లలో తన తండ్రి బాలాసాహెబ్ థాక్రే ఫొటోనే కనిపిస్తోందన్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఓటమి ఖాయమని తెలుసు కాబట్టే మోదీ, అమిత్​ షా ఫొటోలు వేసుకోలేదని ఎద్దేవా చేశారు. వాళ్ల ఫొటోలతో ప్రజలను ఓట్లడగలేకే బాల్ థాక్రే ఫొటోను వాడుకుంటున్నారని ఉద్ధవ్ థాక్రే మండిపడ్డారు. మహారాష్ట్రను లూఠీ చేసిన బీజేపీకి రాష్ట్రంలో ఓటమే దిక్కవుతుందని ఉద్ధవ్​ పేర్కొన్నారు.