బీజేపీలో చేరనున్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ !

V6 Velugu Posted on Oct 27, 2021

భారత మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్ రాజకీయాల్లోకి  ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ బీజేపీలో ఆయన చేరనున్నట్టు సమాచారం. ఇప్పటికే లక్ష్మణ్ తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు చెపుతున్నారు. మరోవైపు ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు క్రికెటర్లు బీజేపీలో ఉన్నారు.
 
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ... క్రికెట్ ఫ్యాన్స్ అంతా అభిమానించే లక్ష్మణ్ ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. బీజేపీలో చేరేందుకు లక్ష్మణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది. GHMC పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ ను ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. లక్ష్మణ్ చేరికపై త్వరలోనే బీజేపీ అధికారిక ప్రకటన చేయనుంది.
 
2012లో అంతర్జాతీయ క్రికెట్ కు లక్ష్మణ్ వీడ్కోలు పలికారు. ఆ తర్వాత ఐపీఎల్ ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్ గా ఉన్నారు. ఇదే సమయంలో ఓ స్పోర్ట్స్ ఛానల్ కు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

Tagged former cricketer, VVS Laxman, join BJP

Latest Videos

Subscribe Now

More News