ఉప్పల్, వెలుగు: హైదరాబాద్క్రికెట్అసోసియేషన్(హెచ్‌సీఏ) మెంటార్‌గా మాజీ క్రికెటర్వసీం జాఫర్‌ను నియమించింది. హెచ్‌సీఏ సెక్రటరి జీవన్ రెడ్డి, ఆపరేషన్హెడ్అంబటి రాయుడు సోమవారం ఉప్పల్ క్రికెట్‌స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వివరాలు వెల్లడించారు. 2 సంవత్సరాల కాంట్రాక్ట్‌తో జాఫర్సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
ప్లేయర్లు, కోచ్‌లకు మార్గనిర్ధేశనం చేయడంతో పాటు తెలంగాణలో డిస్ట్రిక్ట్ లెవెల్క్రికెట్అభివృద్దికి కొత్త ప్రణాళికలు చేపడుతున్నట్లు హెచ్‌సీఏ వెల్లడించింది. పలు జిల్లాల్లో క్రికెట్ అకాడమీలు, బీసీసీఐ నామ్స్‌తో సూర్యాపేట, జగిత్యాల, నాగర్‌కర్నూల్, సిద్ధిపేట్‌లో సెంటర్ ఆఫ్ఎక్సలెన్స్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
రాబోయే సీజన్ నుంచి ఇనిస్టిట్యూషన్ టీమ్‌లను ఏ, బీ, సీ డివిజన్లుగా విభజించనున్నట్లు చెప్పారు. దీంతో దాదాపు 600 మంది కొత్త ప్లేయర్లకు లీగ్ వ్యవస్థలోకి వచ్చే అవకాశం కలుగుతుందన్నారు. జులై 12న జరిగే టీజీ 20 ఫైనల్ మ్యాచ్‌కు సీఎం, గవర్నర్లను ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
