టీజీ 20 లీగ్‌‌‌‌లో నల్గొండ హ్యాట్రిక్‌‌‌‌ విజయం

టీజీ 20 లీగ్‌‌‌‌లో నల్గొండ హ్యాట్రిక్‌‌‌‌ విజయం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: టీజీ 20 లీగ్‌‌‌‌లో అనురాగ్‌‌‌‌ నల్గొండ నైట్స్‌‌‌‌ హ్యాట్రిక్‌‌‌‌ విజయాలను నమోదు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ బుద్ధి (68 నాటౌట్‌‌‌‌) చెలరేగడంతో.. సోమవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో నల్గొండ 6 వికెట్ల తేడాతో పాలమూరు  స్ట్రయికర్స్‌‌‌‌పై గెలిచింది. ముందుగా పాలమూరు 20 ఓవర్లలో 148/9 స్కోరు చేసింది. ప్రజ్ఞయ్‌‌‌‌ రెడ్డి (55), తేజ (50) హాఫ్‌‌‌‌ సెంచరీలు సాధించారు. 

అర్ఫాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ 3, నిశాంత్‌‌‌‌ 2 వికెట్లు తీశారు. తర్వాత నల్గొండ 15.2 ఓవర్లలో 149/4 స్కోరు చేసి నెగ్గింది. జశ్వత్‌‌‌‌ మోతె (17), గౌరవ్‌‌‌‌ రెడ్డి (18), నితీశ్‌‌‌‌ రెడ్డి (19), వరుణ్‌‌‌‌ గౌడ్‌‌‌‌ (13) ఫర్వాలేదనిపించారు. రిషబ్‌‌‌‌ బస్లాస్‌‌‌‌ 2 వికెట్లు పడగొట్టాడు. రాహుల్‌‌‌‌ బుద్ధికి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.