సొంత గడ్డపై‌‌‌ ఇంగ్లాండ్‎ చిత్తు.. న్యూజిలాండ్‏దే టెస్ట్‌‌‌‌ సిరీస్‌

సొంత గడ్డపై‌‌‌ ఇంగ్లాండ్‎ చిత్తు.. న్యూజిలాండ్‏దే టెస్ట్‌‌‌‌ సిరీస్‌

నాటింగ్‌‌‌‌హామ్‌‌‌‌: ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో ఆకట్టుకున్న న్యూజిలాండ్‌‌‌‌.. ఇంగ్లండ్‌‌‌‌తో జరిగిన మూడో టెస్ట్‌‌‌‌లో 160 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను కివీస్‌‌‌‌ 2–1తో సొంతం చేసుకుంది. 373 రన్స్‌‌‌‌ లక్ష్య ఛేదనలో 103/4 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో సోమవారం ఆఖరి రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 51.2 ఓవర్లలో 212 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. జెమీ స్మిత్‌‌‌‌ (60) ఒంటరి పోరాటం సరిపోలేదు.

బెన్‌‌‌‌ డకెట్‌‌‌‌ (36), బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ (30) పోరాడి విఫలమయ్యారు. వంద రన్స్‌‌‌‌, ఐదు క్యాచ్‌‌‌‌లు పట్టిన డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’, జోఫ్రా ఆర్చర్‌‌‌‌ (ఇంగ్లండ్‌‌‌‌), నాథన్‌‌‌‌ స్మిత్‌‌‌‌ (కివీస్‌‌‌‌)కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద సిరీస్‌‌‌‌’ అవార్డులు లభించాయి. 1999 తర్వాత ఇంగ్లండ్‌‌‌‌ గడ్డపై కివీస్‌‌‌‌కు ఇది తొలి టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ విజయం కావడం విశేషం. స్టార్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌తో ఇంటర్నేషనల్‌‌‌‌ కెరీర్‌‌‌‌కు గుడ్‌‌‌‌ బై చెప్పాడు.