
హైదరాబాద్, వెలుగు: పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ పేరుంటే తప్పేంటని మాజీ విద్యా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ ఫొటో, గుర్తులు తొలగించాలనే ఆలోచన పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ‘‘తమిళనాడులో స్టాలిన్ సీఎం కాగానే జయలలిత ఫొటోతో ఉన్న బ్యాగులు, బుక్స్ పంపిణీ చేసి తన హుందాతనాన్ని చాటుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు కూడా జగన్ మోహన్ రెడ్డి ఫొటోతో ఉన్న కిట్లను పంపిణీ చేయాలని, ప్రజాధనం వృథా కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కానీ మన రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చిన పుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉందని బుక్స్ ను వెనక్కి తెప్పించడం, పేజీలను చింపెయ్యడం, ఆ పేజీలపై మరో పేజీ అతికించడం సమంజసమా?’’ అని ప్రశ్నించారు.