
హైదరాబాద్, వెలుగు: తుంటి మార్పిడి చికిత్స చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ను మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పరామర్శించారు. ఆదివారం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న నరసింహన్ దంపతులకు బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్ దంపతులతో నరసింహన్ దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నరసింహన్ దంపతులను కేసీఆర్దంపతులు సత్కరించి పట్టువస్త్రాలు అందజేశారు. తెలంగాణ గవర్నర్‌గా తనకు అప్పటి ప్రభుత్వం ఎంతో సహకరించిందని నరసింహన్ గుర్తు చేసుకున్నారు. ఈ భేటీలో ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, సంతోష్ కుమార్, బీబీ పాటిల్తదితరులు పాల్గొన్నారు.
అజ్మీర్ దర్గాకు చాదర్..
అజ్మీర్ దర్గాకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చాదర్పంపించారు. ఏటా ఉర్సు షరీఫ్ సందర్భంగా అజ్మీర్ దర్గాకు కేసీఆర్ చాదర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ముస్లిం మత పెద్దలతో చాదర్‌ను పంపారు. మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, నాయకుడు ఆజం అలీ, ముస్లిం మత పెద్దల సమక్షంలో ఆదివారం తన నివాసంలో కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.