మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
  • కరోనా నుంచి కోలుకున్నా ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో విషమించిన ఆరోగ్యం
  • కార్మిక నేత.. తొలి, మలి తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి కన్ను మూశారు. అనారోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్‌ తీసుకుంటు న్న ఆయన బుధవారం అర్ధరాత్రి దాటాక 12.25కు తుదిశ్వాస విడిచారు. గత నెల 28న కరోనా పాజిటివ్‌ తేలడంతో బంజారాహిల్స్ లోని ఓహాస్పిటల్ లో చేరారు. 16 రోజుల తర్వాత నెగిటివ్‌ వచ్చినా ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్‌ కారణంగా హాస్పిటల్ లోనే ట్రీట్ మెంట్‌ తీసుకుంటున్నా రు. శ్వాస తీసుకోవడంలోఇబ్బంది పడుతుండటం, ఆక్సి జన్‌ లెవల్స్‌ తగ్గిపోవడంతో గత మూడ్రోజులుగా వెంటిలేటర్ పై ఉన్నారు. ఆయన భార్య అహల్యారెడ్డికి కూడా కరోనా సోకి తగ్గింది. అయితేలంగ్‌ ఇన్ఫెక్షన్‌ ఉండటంతో అదే ఆస్పత్రిలో నాయిని గదికి ఎదురుగా ఉన్న రూమ్ లోనే ట్రీట్ మెంట్‌ తీసుకుంటున్నారు. నాయినికి కొడుకు దేవేందర్ రెడ్డి , బిడ్డ  మతరెడ్డిఉన్నారు. అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జీహెచ్ఎంసీ రామ్ నగర్‌ డివిజన్‌ కార్పొరే టర్ గా కొనసాగుతున్నారు.

కార్మిక నాయకుడిగా..ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుగొమ్ములో దేవయ్యరెడ్డి , సుభద్రమ్మ దంపతులకు 1940 ఫిబ్రవరి 12న నాయిని పుట్టారు. 1960లో హైదరాబాద్ వచ్చారు. వీఎస్టీలో పరిశ్రమలో కార్మిక నేతగా కార్మికుల హక్కుల కోసం పోరాడారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985,2004ల్లోనూ గెలిచారు. 2001 టీఆర్‌ఎస్‌ ఏర్పాటు నుంచి కేసీఆర్ వెంటనడిచారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పొత్తు లో భాగంగా నాటి వైఎస్సార్‌ కేబినెట్ లో మంత్రిగా చేరారు. ఆ తర్వాతి రాజకీయ పరిణామాలతో కేబినెట్ నుంచి రాజీనామా చేసి బయటకొచ్చారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ కేబినెట్ లో తొలి హోం మంత్రిగా 2014 నుంచి 2018 వరకు పని చేశారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు.

నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో,టీఆర్ఎస్ పార్టీలో,ప్రభుత్వంలో కలిసి పనిచేసిన అనుభందాన్ని గుర్తు చేసుకున్నారు. నాయిని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  అధికారిక లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్ నాయిని నర్సింహరెడ్డిని ఆస్పత్రిలో పరామర్శించారు.

టిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు..

కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి శ్రీ నాయని నరసింహా రెడ్డి  మరణించడం చాలా బాధాకరమన్నారు మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమంలో వారితో ఉన్న అనుబంధం మరువలేనిదన్నారు. వారి మరణం టిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటని…. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ.. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.