కూసుమంచి, వెలుగు : తిరుమలాయపాలెం మండల కొక్కెరేణి గ్రామంలో హెచ్పీ పెట్రోల్ బంకును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం ప్రారంభించారు. ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తీగల విజయ్ తన కుమారుడు సాయి ఉమేశ్ పేరిట ఏర్పాటు చేసిన ఈ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడుగా ఉన్న ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ నాణ్యమైనపెట్రోల్, డీజిల్ వినియోగదారులకు అందించి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎంపీ వద్దిరాజును విజయ్ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పారా నాగేశ్వరరావు, ఆకుల గాంధీ, పసుపులేటి దేవేందర్, జాబిశెట్టి శ్రీనివాసరావు, మహంకాళి రాజశేఖర్ పాల్గొన్నారు.
