- కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దేశ, రాష్ట్రాల అభివృద్ధిలో పంచాయతీలే కీలకమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గిరిజన లంబాడ సంఘాల జాయింట్యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో లంబాడ గిరిజన సర్పంచులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. జేఏసీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ ఏజెన్సీ చట్టాల పరిరక్షణకు సర్పంచులు కృషి చేయాలని సూచించారు.
గ్రామాల్లో యువత గంజాయి బారిన పడకుండా సర్పంచులు ప్రధాన భూమిక పోషించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, జేఏసీ నేతలు గుగులోత్ రాజేశ్, రమేశ్, ప్రసాద్, జుంకీలాల్, వెంకటేశ్వర్లు, విఘ్నేష్, లాలు నాయక్, కృష్ణ, హథీరాం, రవి రాథోడ్, బాదావత్ శాంతి, శ్రీనివాస్, మంగీలాల్, మోహన్, రాంబాబు పాల్గొన్నారు.
