కాంగ్రెస్ లోకి మాజీ మార్కెట్ చైర్మన్

కాంగ్రెస్ లోకి మాజీ మార్కెట్  చైర్మన్

కొత్తకోట, వెలుగు: దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్​ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తకోట పట్టణానికి చెందిన మార్కెట్  కమిటీ మాజీ చైర్మన్  సాక బాలనారాయణ, కౌన్సిలర్ రామ్మోహన్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో  కాంగ్రెస్  పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలనారాయణ  మాట్లాడుతూ కాంగ్రెస్  పార్టీ అందిస్తున్న ఆరు గ్యారంటీలు తనను ఆలోచింపజేశాయని చెప్పారు. మాజీ జడ్పీటీసీ పీజేబాబు, పల్లెపాగ ప్రశాంత్, మేస్ర్తీ శ్రీను పాల్గొన్నారు.