మాజీ మంత్రికి చెప్పుల దండతో స్వాగతం

మాజీ మంత్రికి చెప్పుల దండతో స్వాగతం

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా భీమిలి మండలం, కె.నగరపాలెం వెళ్లిన ఆయనకు శుక్రవారం రాత్రి నిరసన సెగ తగిలింది. తమ గ్రామంలోకి రావద్దంటూ స్థానికులు రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి వెళ్లి దాన్ని తొలగించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అవంతి శ్రీనివాస్ తమ గ్రామంలోకి రావద్దంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులను ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.