మాజీ మంత్రి రామస్వామి మృతి

మాజీ మంత్రి రామస్వామి మృతి

హైదరాబాద్, వెలుగు: బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి పి. రామస్వామి గురువారం మృతి చెందారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఉన్న ఆయన జూబ్లిహిల్స్ అపోలో హాస్సిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ గౌలిగూడకు చెందిన రామస్వామి మున్సిపల్ కార్పొరేటర్ గా రాజకీయ జీవితం ప్రారంభించారు. మహరాజ్ గంజ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పని చేశారు. సిటీలో అనేక ఆలయాల అభివృద్ధిలో రామస్వామి కీలక పాత్ర పోషించారు. ఇటీవల 70 ఏళ్లకు పైబడిన బీజేపీ నేతలతో ప్రధాని మోడీ మాట్లాడారు. అందులో భాగంగా రామస్వామికి ఫోన్ చేశారు. ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

బీజేపీ నేతల సంతాపం..
రామస్వామి మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ దత్తాత్రేయ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఇంద్రసేనారెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. పాతబస్తీలో గొడవలు జరిగినప్పుడు రామస్వామి అక్కడ పర్యటించి ప్రజల్లో ధైర్యం నింపారని, మజ్లిస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నా, వారితో విభేదించారని దత్తాత్రేయ అన్నారు.

For More News..

లాక్డౌన్ ఉండదంటూ మంత్రుల లీకులు

ప్రభుత్వంలో 10 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్

సెక్రటేరియట్ శిథిలాల ట్రాన్స్ పోర్టుకే రూ. 15 కోట్లు!