మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండె పోటు

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండె పోటు

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండె పోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మైల్డ్ స్ట్రోక్‎గా గుర్తించిన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 2025, నవంబర్ 6న శివకోటి గ్రామంలో సూర్యారావు పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

 బుధవారం (నవంబర్ 5) కార్యక్రమ ఏర్పాట్లలో ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత సిబ్బంది అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సూర్య రావు మైల్డ్ స్ట్రోక్‎కు గురైనట్లు గుర్తించిన వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు.  సూర్య రావుకు ప్రాణపాయం తప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కేడర్ ఊపిరిపీల్చుకున్నారు.