- మాజీ మంత్రి జీవన్ రెడ్డి
రాయికల్, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో నిరుపేదలైన దళిత, గిరిజన, ఆదివాసీలకు మొదటి ప్రాధాన్యమిస్తున్నట్లు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం రాయికల్ మండలం బోర్నపల్లి శివారులోని మరాఠా కాలనీలో సద్గురు పూలాజీ బాబా ఆధ్యాత్మిక సత్సంగ్ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరాఠాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే ఆరాధ్య సద్గురు పూలాజీ బాబా చూపిన ఆధ్యాత్మిక, ధ్యాన సన్మార్గాలు ఎంతో గొప్పవన్నారు. తెలంగాణలోనే కాకుండా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలలో బాబా ప్రవచనాలు, బోధనల వల్ల ఎన్నో కుటుంబాలు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాయని తెలిపారు.
బోర్నపల్లి అనుబంధ గ్రామం జగన్నాథ్ పూర్, బోర్నపల్లి గ్రామాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కోరగా రూ.17.50 కోట్ల మంజూరు చేస్తూ జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు చంద్ర కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, లీడర్లు ఆంజనేయులు, రమేశ్, జలపతి, మహిపాల్, లక్ష్మణ్, సత్యం, మోతిరాం, ఆత్మరామ్, రఘునాథ్ పాల్గొన్నారు.

