
రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ సవాల్ చేశారు. రుణమాఫీ సక్సెస్ అయిందని నిరూపిస్తే రాజకీయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సన్యాసం తీసుకుంటానన్నారు. సెక్యూరిటీ లేకుండా..మీడియాను తీసుకుని కొడంగల్ సహా ఏ నియోజకవర్గానికైనా చర్చకు సిద్దమన్నారు. రుణమాఫీ సక్సెస్ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.. కొండల్ రెడ్డి యూఎస్ పర్యటన సక్సెస్ అయింది కానీ.. రేవంత్ అమెరికా టూర్ పెద్దగా సక్సెస్ కాలేదు.కుటుంబ పాలన బ్రహ్మండంగా సాగుతోందని విమర్శించారు కేటీఆర్.
రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ దగా చేసిందన్నారు కేటీఆర్. రూ.2లక్షల అప్పు తెచ్చుకోండి..మాఫీ చేస్తా.. ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే మాఫీ ఈజీగా చేయొచ్చని ఎన్నికల ముందు రేవంత్ అన్నారు..రుణాలు40 వేల కోట్లు అని చెప్పిన మాఫీ చేసిందెంత అని ప్రశ్నించారు. చాలా మంది రైతులు రుణమాఫీ కాకపోవడంతో ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఇన్ కం ట్యాక్స్ కట్టారని..రేషన్ కార్డు లేదని రుణమాఫీ చెయ్యలేదని చెప్పారు.. సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని నిరూపించారని ఎద్దేవా చేశారు. 22లక్షల 27 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. అడ్డగోలు ఆంక్షలు,షరతులు,కోతలతో అన్నదాతల్ని నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన రైతుల్లో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదన్నారు కేటీఆర్.
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసుపెట్టాలన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఆరోగ్యం కుటుంబ పాలన ఒక్కసారి చూసుకోవాలన్నారు. సీఎం పిచ్చోడిలా మాట్లాడడం వల్లే రాష్ట్రం నుంచి పెట్టుబడులు గ్గతిపోతున్నాయని చెప్పారు.