
భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై శామీర్‌పేట్‌లో నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును కోరారు. గత వారం క్రితం(డిసెంబర్ 13) మల్లారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. 47 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఆరోపణపై మల్లారెడ్డితో పాటు 9 మందిపై కేసు నమోదు అయింది.
తనను రాజకీయ కక్ష సాధింపుతోనే ఇలా చేశారని మాజీ మంత్రి మల్లారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. మల్లారెడ్డి పిటిషన్ పై శుక్రవారం(డిసెంబర్ 22) హైకోర్టులో విచారణ జరగనుంది.