
హైదరాబాద్, వెలుగు : పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు.
తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం మీడియాతో ఆయన చిట్చాట్చేశారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచిందని తెలిపారు. 2014లో మల్కాజిగిరి నుంచి తాను ఎంపీగా గెలిచానని, పార్టీ ఇప్పుడు అవకాశమిస్తే పోటీకి సిద్ధంగా ఉన్నానని మల్లారెడ్డి పేర్కొన్నారు.