
బోధన్,వెలుగు: బతుకమ్మలో పువ్వులు పెట్టినట్లు అందరి చెవిలో పువ్వులుపెట్టి ప్రజలను ఎమ్మెల్సీ కవిత మోసం చేస్తున్నారని మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం మండలంలోని రాజీవ్ నగర్తండా, ఊట్పల్లి, అమ్దాపూర్, బెల్లాల్, ఏరాజ్పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులతో కలసి ప్రచారం నిర్వహించారు. ఊట్పల్లిలో ఆయన మాట్లడుతూ ఎన్ఎస్ఎఫ్ భూములు తన హయంలోనే ఇప్పించానని నేటికి ఆ భూములకు పట్టాలు ఇవ్వలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే అందరికీ పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే షకీల్ దోచుకోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి, ఎల్లయ్య, నాగేశ్వర్రావ్, తలారీ నవీన్,నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.