మాజీ మంత్రి రామస్వామి సేవలు ఎనలేనివి

 మాజీ మంత్రి రామస్వామి సేవలు ఎనలేనివి

ఆయన విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఆనందంగా ఉంది: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: మాజీ మంత్రి రామస్వామి ప్రజలకు చేసిన సేవలు ఎనలేనివని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం గౌలిగూడలో శ్రీ విఠలేశ్వర బాల భక్త సమాజం ఆధ్వర్యంలో మాజీ మంత్రి రామస్వామి 85వ జయంతి వేడుకలకు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌలిగూడలో రామస్వామి విగ్రహాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయచే ఆవిష్కరింప చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రామస్వామి ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో ప్రజలకు ఎనలేని సేవలందించారని, తన తండ్రి వెంకటస్వామి సివిల్ సప్లై మంత్రిగా వెంకటస్వామి ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై నిరంతరం కలుస్తుండేవారని గుర్తు చేసుకున్నారు. నిరంతరం జనంలో ఉండే రామస్వామి ఎప్పుడు బుల్లెట్ బండి పైన తిరిగే వారని, ఆ రోజుల్లో గొప్ప రాజకీయ నేత అని వివరించారు.

రామస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

రామస్వామి 85వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్య అతిధి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రామస్వామి విగ్రహానికి నివాళులు అర్పించారు. రామస్వామి తన నియోజకవర్గంలో ఎవరింట పెండ్లి జరిగినా లేదా  చావు లైనా పూర్తి అయిపోయే వరకు ఉండే వ్యక్తి రామస్వామి అని గుర్తు చేసుకున్నారు. నీతి నిజాయితీతో కూడుకున్న రాజకీయాలు చేశారని,  ఆస్తుల కోసం రాజకీయ చేయలేదని కొనియాడారు. హైదరాబాదులో ఎక్కడ అల్లర్లు జరిగినా బుల్లెట్ మీద వెంటనే పోయిన ధైర్యశాలి రామస్వామి అన్నారు. హైదరాబాదులో హిందూ దేవాలయాలు ఏర్పాటు చేయడంలో రామస్వామి గొప్ప పాత్ర పోషించారని, నేటి  సమాజo రామస్వామి ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ప్రజలకు సేవలు అందిస్తూ ఆయన కుమారుడు రాజు రామస్వామిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆలోచనా విధానాలను ముందు తీసుకోవాలని గవర్నర్ దత్తాత్రేయ ఆకాంక్షించారు.