పార్టీకి కవిత ఎంతో నష్టం చేశారు అందుకే పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారు : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

పార్టీకి కవిత ఎంతో నష్టం చేశారు అందుకే పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారు : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్, వెలుగు: మూడు నెలలుగా బీఆర్​ఎస్​ పార్టీకి కవిత ఎంతో నష్టం చేశారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆమెను సస్పెండ్​ చేస్తూ కేసీఆర్​ తీసుకున్న నిర్ణయం మహిళలను సంతోషపరిచిందన్నా రు. మంగళవారం తెలంగాణ భవన్​లో మీడియాతో ఆమె మాట్లాడారు. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కవిత ఎట్లా అంటారని మండిపడ్డారు. పార్టీలో కవిత ఉంటే ఎంత, పోతే ఎంత అన్నారు. కవిత.. తన గొయ్యి తానే తవ్వుకున్నారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. 

కవిత చేసిన వ్యాఖ్యలతో పార్టీ కార్యకర్తలు రగిలిపోతున్నారని మాజీ ఎంపీ మాలోతు కవిత అన్నారు. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించబోనని మాజీ సీఎం కేసీఆర్​ గతంలోనే చెప్పారని బీఆర్ఎస్​ ఎల్పీ విప్​, ఎమ్మెల్యే కేపీ వివేకానంద​ అన్నారు. కన్న కూతురు కన్నా కార్యకర్తల భవిష్యత్తే ముఖ్యమని కేసీఆర్​ అనుకున్నారని, అందుకే ఆమెను సస్పెండ్ చేశారని మంగళవారం ఓ ప్రకటనలో వివేకానంద్  పేర్కొన్నారు. పార్టీ నుంచి కవిత సస్పెన్షన్​పై ఆయన స్పందించారు. కొద్ది రోజులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలను కవిత అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఆమె వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని గుర్తించి సస్పెండ్​ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.