టెట్రాప్యాక్​ మద్యాన్ని పిల్లలు తాగే ప్రమాదముంది..ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు: శ్రీనివాస్​ గౌడ్​

టెట్రాప్యాక్​ మద్యాన్ని పిల్లలు తాగే ప్రమాదముంది..ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు: శ్రీనివాస్​ గౌడ్​

హైదరాబాద్, వెలుగు: టెట్రా ప్యాక్​లలోని మద్యాన్ని పిల్లలు ఫ్రూటీల్లాగా తాగే ప్రమాదముందని మాజీ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ అన్నారు. మద్యం ధరలు 10 శాతం పెంచితే సామాన్యులపై భారం పడుతుందని, ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆరోపించారు. శనివారం ఆయన తెలంగాణభవన్​లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు సర్కారు మద్యం రేట్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు.

మద్యం రేట్లు పెంచితే ఎవరూ ధర్నా చేయ్యరనే.. ప్రభుత్వం రేట్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. దీనివల్ల నకిలీ మద్యం ఏరులై పారే ప్రమాదం ఉందని వెల్లడించారు. మద్యాన్ని టెట్రా ప్యాక్ లలో తీసుకొస్తే.. అన్ని ప్రాంతాల్లోనూ మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగే చాన్స్ ఉందని వివరించారు. ప్రభుత్వం కొత్తగా 604 బ్రాండ్లకు అనుమతిచ్చే యోచనలో ఉందన్నారు. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్ర పరిస్థితి జమ్మూకాశ్మీర్​ కంటే దారుణంగా తయారైందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.