కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి గందరగోళం: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి గందరగోళం: మాజీ ఎమ్మెల్యే కోనేరు  కోనప్ప

కాంగ్రెస్ పై మరోసారి అసంతృప్తి  వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.  అసెంబ్లీ ఎన్నికల్లో  ఓటమి తర్వాత కాంగ్రెస్ లో చేరానని పార్టీలో గందరగోళం పరిస్థితులు ఉన్నాయన్నారు. కుమ్రం భీమ్ జిల్లా కౌటల మండల‌కేంద్రంలో‌ అనుచరులతో భేటీలో మాట్లాడిన కోనప్ప..  కాంగ్రెస్ లో తన మీద ప్రేమ లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పనులను కాంగ్రెస్ రద్దు చేసిందన్నారు. గత పదేళ్లలో రైతులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నా కానీ..ఇపుడు రైతులను పట్టించుకునే వారే లేరన్నారు కోనప్ప.

 కౌటాల బ్రిడ్జిని ప్రభుత్వం  రద్దు చేసింది. 11 సార్లు  రోడ్లు   మంజూరైనా  తర్వాత కూడా రద్దు చేశారు.  రోడ్ల రద్దుపై మంత్రి సీతక్క దృష్టికి   తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. కౌటల బ్రిడ్జీ నిర్మాణం చేయాలని కోరినా సీఎం రేవంత్ పట్టించుకోలేదు.   సిర్పూర్  నియోజకవర్గాన్ని   సీఎం  పట్టించుకోవడం లేదు.. మే  25న  చింతలమానేపల్లిలో   అత్మీయ సమ్మేళనం ఉంది. కార్యకర్తలు అందరు తప్పకుండా రావాలి అని కోనప్ప అన్నారు.

కోనేరు కోనప్ప అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. తర్వాత ఏడాది కూడా గడవకముందే ఆపార్టీ నుంచి బయటకొచ్చి ప్రస్తుతం ఇండిపెండెంట్ గా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ దొంగల కంపెనీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనప్ప ప్రస్తుతం ఏ పార్టీలో చేరలేదు.