
- మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
కౌడిపల్లి, వెలుగు: చిలుముల కిషన్ రెడ్డి అజాతశత్రువు అని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. ఆదివారం కౌడిపల్లిలో కిషన్ రెడ్డి ఆరో వర్ధంతి నిర్వహించారు. స్మృతి వనంలో కిషన్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారని గుర్తుచేశారు. నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి కిషన్ రెడ్డి అని పేర్కొన్నారు.
ఆయన వర్ధంతి సందర్భంగా కౌడిపల్లిలోని భవన నిర్మాణ కార్మికులకు రూ.లక్షతో బోరుబావి తవ్వించారు. కార్యక్రమంలో మహమ్మద్ నగర్ సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, సంఘ సేవకులు గంగాధర్, చిలప్చెడ్మాజీ జడ్పీటీసీ శేష సాయి రెడ్డి, జిల్లా గౌడజన హక్కుల పోరాట సమితి సంఘం అధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, చిరంజీవి, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్ గుప్తా, శాఖయ్య, శ్రీధర్ గుప్తా, మల్లేశం, మక్బూల్, చిన్నంరెడ్డి, దుర్గారెడ్డి, జాకీర్ పాల్గొన్నారు.
గౌతపూర్ హైస్కూల్ లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు
చిలప్ చెడ్: కిషన్ రెడ్డి ఆరో వర్ధంతి సందర్భంగా మండలంలోని గౌతాపూర్ హై స్కూల్లో చిలుముల సుహాసిని రెడ్డి, మదన్ రెడ్డి మినీ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు వాటర్ ప్లాంట్ ను వినియోగించుకోవాలన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, స్కూల్కు, టీచర్లకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, స్కూల్సిబ్బంది వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ విఠల్, విశ్వంబర్ స్వామి, కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణరెడ్డి, చిరంజీవి, అంజిరెడ్డి, విఠల్, హెచ్ఎం కృష్ణ పాల్గొన్నారు.