
కొడంగల్, వెలుగు: గత ప్రభుత్వ పథకాలను అమలు చేస్తే చాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కొడంగల్కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేసి మాట్లాడారు. అధికారం కోసం కాంగ్రెస్సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిందన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునట్లే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు. కార్యక్రమంలో నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, సలీం, నారాయణరెడ్డి, భీములు, మధుసూదన్‌రావు, మహిపాల్‌రెడ్డి, చాంద్‌పాష, రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.