
- గజ్వేల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలి
అల్వాల్, వెలుగు: ఏడాదిగా ప్రజలకు అందుబాటులో లేని గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ను పదవి నుంచి తొలగించాలని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, స్టేట్ మహిళా యూత్ వైస్ ప్రెసిడెంట్ అంక్షారెడ్డి డిమాండ్చేశారు. గజ్వేల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
గవర్నర్ కు మెమొరాండం ఇవ్వనున్నట్లు తెలిపారు. కేసీఆర్ తీరును వివరిస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సిద్దిపేట కలెక్టరేట్ నుంచి రాజభవన్ కు చేపట్టిన పోరుబాట పాదయాత్ర ఆదివారం అల్వాల్ సర్కిల్ లోతుకుంట చేరుకుంది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్వెన్నెల, నాచారం టెంపుల్ మాజీ చైర్మన్ లక్ష్మీనర్సింహులు గౌడ్ పాల్గొన్నారు.