
- మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్ టౌన్, వెలుగు: భారీ వర్షాల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు పరిహారం ఇవ్వాలని, దెబ్బతిన్న రోడ్లను వెంటనే రిపేర్ చేయించాలని బీఆర్‌ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆమె హవేలీ ఘనపూర్ మండలంలోని ధూప్ సింగ్ తండా బాధితులను పరామర్శించారు. రాజ్పేట గ్రామంలో వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన యాదాగౌడ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ధూప్‌సింగ్ తండా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో తండావాసులు గుట్టపై ఉన్నారని తాగడానికి నీరు, తినడానికి తిండి లేక ఆకలికి అలమటించారన్నారు. సహాయక చర్యలు చేయడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జడ్పీ మాజీ చైర్ పర్సన్ లావణ్య, బీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, యామిరెడ్డి, సాయిలు, చిన్నాగౌడ్, సాయాగౌడ్, సిద్దిరాంరెడ్డి, భిక్షపతి రెడ్డి, సతీశ్ రావు, బాలరాజ్, రాంచంద్రారెడ్డి, సాయిలు, రవీందర్, మల్లయ్య, చంద్రం, అశోక్, సాయిలు, శ్రీను నాయక్ ,రంజిత్, తరుణ్ ఉన్నారు.