కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా అవినీతే: మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా అవినీతే: మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా అవినీతే. దేశంలో ఇంతపెద్ద స్కామ్​చేసిన వ్యక్తి మరొకరు లేరు. గత ప్రభుత్వం ఎల్​ అండ్​టీతో అబద్ధం చెప్పించ్చింది.  

దీనిపై రివ్యూ నిర్వహిస్తే అసలు దోషి బయటపడతాడు. 2008లోనే వైఎస్ఆర్​హయాంలో కాళేశ్వరంపై సమీక్ష జరిగింది. నాడు రూ.17,800 కోట్లతో 160 టీఎంసీలతో ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు. కాళేశ్వరం అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ అధికారులతో సమగ్ర విచారణ చేయించాలి. కేసును మేడిగడ్డకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతోంది. విచారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖలు రాయడం లేదు’ అని రఘునందన్​రావు ప్రశ్నించారు.