కడారిగూడెం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యేలు

కడారిగూడెం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యేలు

వర్ధన్నపేట, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటి విడత వరంగల్​ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, డాక్టర్ టి.రాజేశ్వరరావు, కొండేటి శ్రీధర్ ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

కార్యక్రమంలో పార్టీ వర్ధన్నపేట మండల ఎన్నికల ఇన్​చార్జి జలగం రంజిత్, జిల్లా కార్యదర్శి జడ సతీశ్,​ మాజీ మండలాధ్యక్షుడు, ఎన్నికల మండల కన్వీనర్ రాయపురం కుమారస్వామి, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి, వార్డు మెంబర్ అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.