కాంగ్రెస్ బలపడకపోతే సమాజానికే తీవ్ర నష్టం

కాంగ్రెస్ బలపడకపోతే సమాజానికే తీవ్ర నష్టం

టీఆర్ఎస్ అంటేనే రాళ్లతో కొట్టి ఉరికించే పరిస్థితులు వస్తాయని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ సర్పంచులే పల్లెప్రగతిని బహిష్కరించే రోజులు వచ్చాయన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. వరద కాలువ కింద భూములు కోల్పోయిన వాళ్లు, ధాన్యం కొనుగోళ్లలో దోపిడీకి గురవుతున్న రైతుల తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు మాట్లాడరంటూ ప్రశ్నించారు. అందరూ బాగుండాలని కాంగ్రెస్ భావిస్తే హిందుత్వాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలకు బీజేపీ కారణమవుతోందని ఆరోపించారు. కొండగట్టు, వేములవాడ ఆలయాలకు నిధులు తీసుకురావాలని బండి సంజయ్ కు పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. 

కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన ఎమ్మెస్సార్, చొక్కారావు, విద్యాసాగర్ రావు, కేసీఆర్ లాంటి వాళ్లు నియోజకవర్గం పేరు కాపాడారని, బండి సంజయ్ నాలుకకు హద్దు లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఒక్కసారి తనను గెలిపించండి ప్లీజ్ అని మాట్లాడిన బండి సంజయ్.. ఇవాళ తన కుమారుడికి బీఎండబ్ల్యూ బైక్ కొనిచ్చాడని అన్నారు. కాంగ్రెస్ బలపడకపోతే సమాజానికే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కార్యకర్తలందరూ ఊరూరా తిరిగి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం..

రేపు పీఎంకేర్స్ చిల్డ్రన్ స్కాలర్ షిప్ లు విడుదల

నేపాల్ లో కూలిన విమానం.. 22 మంది మృతి !