కేటీఆర్ బద్నామ్ కావొద్దనే హరీష్, గంగులకు బాధ్యతలు

కేటీఆర్ బద్నామ్ కావొద్దనే హరీష్, గంగులకు బాధ్యతలు

తెలంగాణ ఉద్యమంలో చిన్నారెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఉద్యోగాల కల్పనపై చర్చకు పిలిస్తే కేటీఆర్ పారిపోయాడని విమర్శించారు. చేవెళ్లలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది కాంగ్రెస్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్ కు కూడా తెలుసన్నారు. కేటీఆర్ బద్నామ్ కావొద్దనే ఇంఛార్జులుగా హరీష్, గంగులను నియమించారన్నారు. కేసీఆర్ ను నమ్ముకొని చాలామంది మోసపోయారని.. తాను కూడా మోసపోయానన్నారు. తెలంగాణ అమరవీరుల శవాలపై స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు.

తెలంగాణ వచ్చాక కూడా రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు వెనుకబడ్డాయన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. TRS కు బలమున్న కరీంనగర్ లోనే జీవన్ రెడ్డిని గెలిపించుకున్నామని గుర్తు చేశారు. ఉద్యమంలో పాల్గొనని వాణీ దేవికి.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి మల్లు రవి.