కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు విస్మరించాయి

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు విస్మరించాయి

గడిచిన ఎనిమిదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సమస్యలు తెలుసుకుని ప్రజల్లో ధైర్యం నింపడం కోసమే పాదయాత్ర చేపడుతున్నాని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ద్వారా బీజేపీ రాష్ట్రంలో బలపడాలనే అవివేకంతో ప్రయత్నిస్తుందన్నారు. గౌరవెల్లి నిర్వాసితులు ఇబ్బంది పడుతుంటే బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ కే పరిమితం అయ్యారని అన్నారు. 

కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం గంభీరావుపేట క్రాస్ రోడ్డు నుంచి ఎల్కతుర్తి వరకు ఈ నెల 9 నుంచి 18 వరకు పాదయాత్ర కొనసాగుతుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు పాదయాత్ర పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏడు నియోజకవర్గాలు, మూడు జిల్లాల పరిధిలో పాదయాత్ర చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరిని ప్రజల్లో ఎండగడతామన్నారు. తన పాదయాత్ర విజయవంతం అయ్యేలా కార్యకర్తలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.