
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తెలంగాణలో వెస్ట్ బెంగాల్ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆ రెండు పార్టీలు నువ్వు కొట్టినట్లు చేస్తే నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్మవారిపై ప్రమాణం చేస్తే బీజేపీ నేత ఈటల ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ ప్లాన్ ప్రకారమే ఈటల బీజేపీలోకి చేరారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ ను జైలుకు పంపిస్తానన్న బండి సంజయ్ రెండు సార్లు జైలుకు వెళ్లాడన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ నియోజకర్గానికి ఏం చేశాడో చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు.
బండి సంజయ్ కార్పోరేటర్ కు ఎక్కువ మేయర్ కు తక్కువంటూ పొన్నం ప్రభాకర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.