న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని ఆదివాసీలకు సంబంధించిన దాదాపు రూ.700 కోట్లను మాజీ సీఎం కేసీఆర్ దారి మళ్లించారని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేంద్రంలోని మోదీ సర్కార్ కూడా చర్యలు తీసుకోలేపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
ఆదివాసీల అంశం కేంద్రం అంశంగా భావించాలన్నారు. ఆదివాసీల డబ్బు ఇతర అంశాలపై ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీలకు 12% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో చెంచుల జన సంఖ్య తగ్గిపోతోందని ఆ జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
