బీజేపీకి గుడ్ బై చెప్పిన ఒడిశా మాజీ సీఎం

బీజేపీకి గుడ్ బై చెప్పిన ఒడిశా మాజీ సీఎం

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. గిరిధ‌ర్ గమాంగ్ త్వర‌లోనే  బీఆర్ఎస్ లో చేర‌నున్నట్లు తెలుస్తోంది. 2015లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన గిరిధర్ తాజాగా బీజేపీ ప్రాథ‌మిక స‌భ్యత్వానికి రాజీనామా చేశారు. గిరిధర్ తో పాటుగా ఆయన కుమారుడు శిశిర్ గ‌మాంగ్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. జనవరి 27న కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేర‌నున్నారని సమాచారం. ఒడిశా నుంచి 9సార్లు పార్లమెంట్‌కు ఎన్నికైన గిరిధర్ 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్‌ 6 వరకు దాదాపు 10 నెలల పాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు.