
కరాచీ: కరోనా దెబ్బకు.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. ఆయన వయసు 50 ఏళ్లు. ఈనెల ఆరంభంలో అనారోగ్యానికి గురైన సర్ఫరాజ్‌ను పెషావర్‌లోని ఓ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కొద్దిగా కోలుకున్నట్లు కనిపించినా.. గత 10 రోజులుగా ప్లేయర్ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. కరోనా లక్షణాలు తగ్గుముఖం పట్టకపోవడంతో పరిస్థితి చేజారి సోమవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సర్ఫరాజ్ 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు.